అసిఫాబాద్: సరండి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు,ఆరోపించిన బాధితులు
వాంకిడి మండలం సరండిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరిగాయని సరండి గ్రామస్థులు లక్ష్మణ్, ఆయాజీ, దేవాజీ ఆదివారం ఆరోపించారు. మొదటి జాబితాలో ఏమి లేని పేదలకు అన్యాయం జరిగిందన్నారు. ఉన్నవాళ్లకు ఇళ్లు మంజూరు చేశారని వాపోయారు. తడకల, రేకుల ఇళ్లల్లో నివసిస్తున్నామన్నారు. గ్రామానికి చెందిన లక్ష్మణ్ కు ఇద్దరు ఆడపిల్లలు, ఆయాజీకి ముగ్గురు ఆడ పిల్లలు, దేవాజీ పేదరికంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అర్హులను గుర్తించాలన్నారు.