పాలకొండ: పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం మత్తులో యువకుడి వీరంగం
శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం మత్తులో ఉన్న అవనాపు కిశోర్ అనే యువకుడు సిబ్బందిపై దాడికి యత్నిస్తూ అద్దాలు పగులగొట్టి హల్చల్ సృష్టించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.