అదిలాబాద్ అర్బన్: మత్తుకు దూరంగా ఉంటూ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'నషా ముక్త్ యువ భారత్' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్రం చేపడుతున్న అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు.