రాజోలు: రాజోలులో 18వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: వినూత్నంగా నిరసన
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో వీఆర్ఏల నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ వీఆర్ఏలు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజోలు మండల డెప్యూటీ తహసీల్దార్ భాస్కర్ సంఘీభావం ప్రకటించారు.