ముమ్మిడివరం: వేటకు వెళ్లి అదృశ్యమైన మత్స్యకారులు - ఆందోళనలో కుటుంబ సభ్యులు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం బలుసుతిప్పకు చెందిన మత్స్యకారుడు సంగాని తాతారావు తోపాటు పడవలోని మత్స్యకారుల ఆచూకీ గల్లంతైంది. కాకినాడలోని వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పరామర్శించి భరోసా ఇచ్చారు.