నందికోట్కూరు: నందికొట్కూరులో మినుము పంట సాగు చేసినా రైతుకు కన్నీళ్లు మిగిల్చింది
నంద్యాల జిల్లా నందికొట్కూరు కు చెందిన రైతు వెంకట్ రెడ్డి సాగుచేసిన మినుము పంట కన్నీళ్లు మిగిల్చింది 9 ఎకరాల్లో మినుపంట సాగు చేయగా సకాలంలో వర్షాలు కురవక పంట ఎదుగుదలలేదు, సొంత పొలం 3 ఎకరాలు మరో ఆరు ఎకరాలను ఎకరాకు 20వేల చొప్పున కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు, పంట చేతికి వచ్చే దశలోనే వర్షాభావంతో పంటలో ఎదుగుదల లేక ట్రాక్టర్ తో దున్నివేశారు, పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయానని రైతు వెంకట్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి పరిహారం అందించాలని కోరారు