బనగానపల్లె: బనగానపల్లెలో ఎంపీటీసీ స్థానాలు పంచుకునేందుకు రంగం సిద్ధం చేసిన ప్రధాన పార్టీలు
బనగానపల్లి నియోజకవర్గంలో మొత్తం 85 ఎంపీటీసీ స్థానాలను టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు పంచుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. రెండు రోజులుగా నేతల మధ్య సాగిన ముమ్మర మంతనాల అనంతరం.. టీడీపీ 58, వైసీపీ 25, జనసేన 2 స్థానాలను దక్కించుకునేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఎక్కడెక్కడ ఏయే అభ్యర్థులు బరిలో ఉండాలనే దానిపై స్పష్టత తెచ్చి, కేవలం వారే నామినేషన్లు వేసేలా నిర్ణయించారు.