డోన్: బేతంచర్ల లో టిడిపి జనసేనకు షాక్, 20 కుటుంబాలు వైసీపీలోకి
Dhone, Nandyal | Oct 24, 2026 బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్ కాలనీలో ఉన్న బుడగ జంగాల పేటకు చెందిన 20 కుటుంబాలు టీడీపీ, జనసేన నుంచి వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు బుగ్గన అర్జున్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బైలపాటి జమ్మన్న, మారెప్ప, సుంకయ్య, చిన్న కులాయప్ప, మధుశేఖర్, బైలపాటి ప్రసాద్ మరో 14 మంది వైసీపీలో చేరారు.