మార్కాపురం: ప్రత్యేక కార్యచరణతోనే ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యం : మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత
సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలించాలంటే ప్రత్యేక కార్యచరణ తోనే అది సాధ్యమవుతుందని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలో ప్లాస్టిక్ ను నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్ తో భావితరాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ రెండో వారం నాటికి ప్లాస్టిక్ ని తగ్గించేందుకు విడతల వారీగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. దీనికి ఎన్జీవోల సహకారం ఉంటే చక్కని ఫలితాలు వస్తాయని కలెక్టర్ అన్నారు