మేడ్చల్: ఉప్పల్: నల్లచెరువు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు మంజూరు
ఉప్పల్ డివిజన్ మల్లికార్జున కాలనీ, శేషసాయినగర్ నుండి నల్లచెరువు వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. విద్యుత్ స్తంభాల తరలింపులో జాప్యం కారణంగా ఆగిన పనులను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి అధికారులను కోరారు.