ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లాలో ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. భారీ అన్నదానం.రక్తదానం చేసిన అభిమానులు
Ongole Urban, Prakasam | Aug 22, 2026
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలో చిరంజీవి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి ఆనందోత్సవాల మధ్య పంపిణీ చేశారు అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించి అభిమానులు భారీగా రక్తదానం చేసారు పేదలకు చిరంజీవి అభిమానులకు అన్నదానం చేశారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎంపిక చేసిన చిరంజీవి అభిమానులకు రక్తదానం చేసినటువంటి ఔత్సాహికులకు ఉచిత ఇన్సూరెన్స్ పాలసీని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కట్టారు.