శ్రీశైలం: ఆత్మకూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మిగిలిపోయిన 7 మద్యం దుకాణాలకు టెండర్లకు ఆహ్వానం
ఆత్మకూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మిగిలిపోయిన 7 మద్యం దుకాణాల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. మొత్తం 16 దుకాణాలకు గాను 9 షాపులు రెన్యూవల్ కాగా, మిగిలిన వాటిలో ఆత్మకూరు మున్సిపాలిటీలో 4, రూరల్లో 2, కొత్తపల్లి మండలంలో ఒక షాపు ఉన్నట్లు తెలిపారు. ప్రతి దరఖాస్తుకు నాన్-రిఫండబుల్ రుసుము రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు