కూసుమంచి: కూసుమంచిలో వీధి కుక్కల దాడి.. భయాందోళనలో స్థానికులు
కూసుమంచిలో వీధి కుక్కల స్వైర్యవిహారంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గుంపులుగా తిరుగుతూ వాహనదారులపై, పాదచారులపై కుక్కలు దాడులు చేస్తున్నాయి. ప్రమాదవశాత్తు కింద పడి చాలామంది గాయపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు సర్పంచ్‌ను కోరుతున్నారు.