ఒంగోలు అర్బన్: ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో మంచినీటికి డబ్బులు వసూలు చేయడం సరికాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రవిబాబు
Ongole Urban, Prakasam | Sep 19, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలకు సరిగా మంచినీరు సరఫరా కావడం లేదు ఈ సందర్భంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయటం హర్షించదగ్గ విషయం అయితే ఉచితంగా అందించాల్సిన మంచినీటికి డబ్బులు వసూలు చేయడం మాత్రం దారుణం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు విమర్శించారు ఆయన మాట్లాడుతూ ఇంటికి పది రూపాయలు వంతన ట్యాంకర్ కు 500 రూపాయలు వసూలు చేయటం సరికాదని అలా వసూలు చేసిన వారిపై నగర కార్పొరేషన్ చైర్మన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అసలే వర్షాభావం కరువు పరిస్థితుల నేపథ్యంలో మంచినీటి కూడా డబ్బులు వసూలు చేయడం దారుణం అన్నారు