నంద్యాల అర్బన్: గోస్పాడు మండలంలో చోరీలకు పడుతున్న దొంగల ముఠా అరెస్ట్
Nandyal Urban, Nandyal | Aug 24, 2026
గోస్పాడు మండలంలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు చెందిన కడప జిల్లాకు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.27 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఆరు చోరీ కేసులను సంబంధించిన వివరాలను నంద్యాల సబ్ డివిజన్ ఎఏస్పి సుస్మితా రామనాధన్ వెల్లడించారు.