డోన్: బేతంచెర్ల సిహెచ్ఎస్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిసిహెచ్ఎస్ డాక్టర్ లలిత
Dhone, Nandyal | Oct 24, 2026 ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు పరిశుభ్రంగా ఉంచాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ లలిత సూచించారు. శనివారం బేతంచర్ల సీహెచ్సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాన్పుల వార్డును సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్య సేవల కోసం రోగుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నారా? మరుగు దొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా అని తెలుసుకున్నారు.