పార్వతీపురం: విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ భద్రతపై సీఐ వెంకటరావు కీలక సూచనలు
పార్వతీపురంలోని శ్రీ రేణుక విస్డం కళాశాలలో విద్యార్థుల కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రత, సోషల్ మీడియా వినియోగం మరియు సైబర్ మోసాలపై సీఐ వెంకటరావు విద్యార్థులకు అవగాహన కల్పించారు.