కొండపి: పొన్నలూరు మండలంలో మహిళలు, చిన్నారుల భద్రత యొక్క రక్షణార్థం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అవగాహన కార్యక్రమం
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మహిళలు చిన్నారుల భద్రతే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నట్లుగా పొన్నలూరు మండలంలో పోలీసులు తెలిపారు. మహిళలు చిన్నారుల భద్రతపై బుధవారం మండలంలో వివిధ ప్రాంతాలలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు కానీ చిన్నారులు కానీ లైంగిక వేధింపులకు లేదా దాడులు తదితర అంశాలపై వేధింపులు ఎదుర్కొంటున్నట్లయితే 112 లేదా 1098 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు వారికి తెలిపారు.