మార్కాపురం: జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టి సబ్ ప్లాన్ సక్రమంగా అమలు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నిరసన
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సక్రమంగా అమలు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చట్ట ప్రకారం జనాభా ప్రతిపాదికన ఎస్సీలకు 16% ఎస్టీలకు 5.30% నిధులు కేటాయించాలని కోరారు. ప్రతి ప్రభుత్వ శాఖలో 100% నిధులు ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మూడు నెలలకు సోషల్ ఆడిట్ చేయాలన్నారు.