కథలాపూర్: గణేష్ నిమర్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరగాలి: కలెక్టర్ సత్యప్రసాద్
వినాయక నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన ధర్మపురి పట్టణం గోదావరి వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం పరిశీలించారు.కలెక్టర్ మాట్లాడుతూ..నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. వరద ఉద్ధృతి ఎక్కువ ఉన్నందున పోలీసు,మున్సిపల్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.విగ్రహాల తరలింపు సమయంలో ఎక్కడా విద్యుత్ వైర్లు తగలకుండా తగిన చర్యలు తీసుకోవాలి.వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్,మేడిపల్లి మండల మండలాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.