ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని జయప్రకాష్ కాలనీలో ట్రాన్స్ జెండర్ పై దాడి, ట్రాన్స్ జెండర్ కు గాయాలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Oct 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని జయప్రకాష్ కాలనీలో ట్రాన్స్ జెండర్ పై దాడి జరిగిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తితో ట్రాన్స్ జెండర్ ఐదు సంవత్సరాలుగా సహజీవనం చేస్తుంది. విభేదాల కారణంగా ట్రాన్స్ జెండర్ పై దాడి చేయడంతో ట్రాన్స్ జెండర్ తీవ్రంగా గాయపడింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు అధికారులు వెల్లడించవలసి ఉంది. గాయపడ్డ ట్రాన్స్ జెండర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.