అంబేద్కర్ ఆశయ సాధన చంద్రబాబుతోనే సాధ్యం: గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్
అంబేద్కర్ ఆశయ సాధన చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అన్నారు. టీడీపీ నేత చింతల అశోక్ కుమార్ చేపట్టిన ఇచ్చాపురం టూ తిరుపతి పాదయాత్రలో భాగంగా గురువారం తిరుపతి జిల్లా గూడూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా సునీల్ కుమార్, స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పాత బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.