నంద్యాల అర్బన్: నడి రోడ్డుపై నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు, తీవ్ర ట్రాఫిక్ జామ్
Nandyal Urban, Nandyal | Aug 23, 2026
నంద్యాలలోని పార్క్ రోడ్డులో ఆత్మకూరు బస్టాండు వద్ద సాంకేతిక లోపం కారణంగా RTC బస్సు నడిరోడ్డుపై నిలిచిపోయింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఎన్టీఆర్ షాదిఖానా ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సు రోడ్డుపై నిలిచిపోవడంతో ఇరువైపులా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు