పిఠాపురం: గొల్లప్రోలులో భారీ చోరీ: 204 గ్రాముల బంగారం, 86 తులాల వెండి మాయం
గొల్లప్రోలులో వ్యాపారి ఊటుకూరి సుబ్బారావు ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు సినిమాకు వెళ్లిన సమయంలో 204 గ్రాముల బంగారం, 86 తులాల వెండిని దొంగలు అపహరించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.