నారాయణపేట్: జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు: ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణపేట జిల్లా ప్రజలకు ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా ప్రజలకు భద్రత మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఎస్పీ సూచించారు. అగ్ని ప్రమాదాలు గాయాలు మరియు శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి బాధ్యతాయుతంగా పండుగను జరుపు కోవాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎస్పి తెలిపారు. లైసెన్స్ పొందిన వ్యక్తుల నుండి మాత్రమే బాణాసంచా కొనుగోలు చేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మాత్రమే బాణాసంచా కాల్చాలని మండే పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.