పామూరు మండలంలోని రావిగుంటపల్లి గ్రామపంచాయతీని కనిగిరి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాస రెడ్డి సోమవారం పరిశీలించారు. పంచాయతీలోని పలు రికార్డులను పరిశీలించి ,ఇంటి పన్ను ఎంత శాతం వసూలు అయిందో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. మండి బకాయిలను త్వరితగతిన వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామపంచాయతీ ఆదాయాన్ని పెంపొందించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు.