వికారాబాద్: మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం.
మహాశివరాత్రి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంది. బక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, టెంట్లు సౌకర్యాలు నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా మహాశివరాత్రి సందర్భంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దర్శనానికి భక్తులు వస్తుంటారు.