సిద్దిపేట అర్బన్: రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రజినీకాంత్ లా తరువాత గజినీకాంత్ లా మారాడు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రజినీ కాంత్ ఎన్నికల తరవాత గజిని కాంత్ గా మారాడని, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయం లో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు తెలంగాణ ముఖం కూడా చూడడం లేదన్నారు. వంద రోజుల్లో ఇస్తామన్న హామీలు నెరవేర్చక 22 నెలలైన అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రేపటి స్థానిక ఎన్నికల్లో బాకీ కార్డ్ బ్రహ్మాస్త్