తుని: తొండంగి పెరుమళ్లాపురం బీచ్లో గల్లంతైన 12 ఏళ్ల బాలిక
Tuni, Kakinada | Oct 23, 2026 తొండంగి మండలం పెరుమళ్లాపురం బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన ఎండపల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల చీకట్ల యశ్వంతిక గల్లంతైంది. భారీ కెరటాల ధాటికి ఈ ఘటన జరిగింది. వెంట ఉన్న మరో ఇద్దరు సురక్షితంగా బయటపడగా, గల్లంతైన బాలిక కోసం ఎస్ఐ జగన్మోహన్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు సాగుతున్నాయి.