గుడిహత్నూరు: గుడిహత్నూర్ లో పోలిసుల ఫ్లాగ్ మార్చ్.. కుదుట పడ్డ పరిస్థితి
గుడిహత్నూర్ మండల కేంద్రంలో పరిస్థితి కుదుట పడింది.శనివారం రాత్రి ఓ బాలికను యువకుడు ఇంట్లో బంధించిన ఘటన నేపథ్యంలో స్థానికులు ఆందోళన చేసి పోలీసులపై దాడి చేశారు. దీంతో మండలంలో మండలంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మండల కేంద్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలంలో శాంతియుత వాతావరణం నెలకోన గా ఎప్పటికప్పుడు పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.