శ్రీశైలం: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను . జిల్లా కలెక్టర్ రాజకుమారి
ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తెలిపారు. మండల స్థాయి, జిల్లా స్థాయి సమస్యలు ఏవైనా ఈ వేదిక ద్వారా స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్య తీవ్రతను బట్టి మూడు వారాల్లోగా కచ్చితంగా పరిష్కారం చూపేందుకు అధికారులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు.