గుంటూరు: కార్మిక చట్టాల సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని గుంటూరు నగరంలో కార్మికులు నిరసన
Guntur, Guntur | Sep 22, 2025 కార్మిక చట్టాల సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సోమవారం లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా సిఐటియు నేత రాధాకృష్ణ మాట్లాడుతూ 10 గంటల పని విధానాన్ని రద్దు చేసి, 8 గంటల పని విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.