శ్రీశైలం: శ్రీశైలంలో వసతి గృహాల విషయంలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి: ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలంలో వసతి గృహాల విషయంలో సైబర్ నేరగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీశైల దేవస్థానం ఈవో తెలియజేశారు. ఈ మధ్యకాలంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల ను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మల్లికార్జున సదన్ ,మరియు గంగా, గౌరీ సాధన పేరుతో ఫేక్ ఫోటోలు పెట్టి వారితో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేవలం దేవస్థానం అధికార వెబ్ సైట్ తో మాత్రమే రూములు బుక్ చేసుకోవాలని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు.