మునగాల: విజయరామపురం గ్రామ శివారులో విషపూరితమైన మొక్కలు తిని గొర్రెలు మృతి: పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్
మునగాల మండలం విజయరాపురం గ్రామ శివారులో సోమవారం రాత్రి కొన్ని గొర్రెలు విషపూరితమైన మొక్కలు తిని మృతి చెందినట్లు సూర్యాపేట పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం వాటి అవయవాలను ఈరోజు నల్లగొండ ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు.