కడప: నిరంతరం విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
Kadapa, YSR | Nov 27, 2025 నిరంతరం విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని, అవసరమైన చికిత్స తీసుకుని ఆరోగ్యంగా జీవించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు.గురువారం నగరంలోని జిల్లా పోలీస్ సంక్షేమ ఆస్పత్రిలో, హైదరాబాద్ చిరంజీవి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, చిరంజీవి హాస్పిటల్స్‌కు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు తమ సామాజిక బాధ్యతగా పోలీసు సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు.