ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు :గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి దిగువున హంద్రీలోకి నీటి విడుదల : ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీర్
గాజులదిన్నె ప్రాజెక్ట్ నుంచి 300 క్యూసెక్కుల నీటి విడుదల.. ఎమ్మిగనూరు గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్ట్ (సంజీవయ్య సాగర్) ఎగువ ప్రాంతాలైన ఆస్పరి, పత్తికొండ, దేవనకొండ మద్దికెర, మండలాల్లో కురుస్తున్న వర్షాలకు హంద్రీ ద్వారా, ప్రాజెక్టులో ఇన్ఫ్రా 500 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. గేట్ 4 నుంచి 300 క్యూసెక్కుల నీటిని దిగువ హంద్రీలోకి నీటి విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీర్ అలీ తెలిపారు.