శ్రీశైలం: మహానంది మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సచివాలయాల పేర్లను 'స్వర్ణ గ్రామాలుగా మార్చండి: జనసేన నాయకులు
మహానంది మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సచివాలయాల పేర్లను 'స్వర్ణ గ్రామాలు'గా మార్చాలని జనసేన నాయకులు డిప్యూటీ ఎంపీడీవోలు సంజీవ కుమార్, భార్గవి లతలకు వినతిపత్రం అందజేశారు. సచివాలయాల పేర్లు మార్పు చేయాలంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసినా, మహానంది మండలంలో అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పేర్లు మార్చాలని వారు డిమాండ్ చేశారు.