శ్రీశైలం: వెలుగోడు పట్టణంలో ఓ ఇంట్లో చోరీ రెండు తులాల బంగారు ఐదు తులాల వెండి 50 వేల నగదు అపహరణ
నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో చోరీ ఘటన కలకలం రేపింది. దాసరి సుభాషిని అనే మహిళ ఇంట్లోకి గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి రెండు తులాల బంగారు ఆభరణాలు, ఐదు తులాల వెండి గొలుసులు, యాభై వేల రూపాయల నగదును అపహరించారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగల ఆచూకీ కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.