కొండపి: కొండపి సర్కిల్ పోలీస్ స్టేషన్లో కేసుల పరిష్కారానికి ఎస్ఐలతో సమావేశం నిర్వహించిన సీఐ సోమశేఖర్
ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని కొండపి సర్కిల్ పరిధిలోని ఎస్ఐలకు సీఐ సోమశేఖర్ సూచించారు. శుక్రవారం కొండపి సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలతో సమావేశం నిర్వహించిన సీఐ సోమశేఖర్.. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు అరికట్టే అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి తెలిపారు. అలానే ఈ సాక్ష అప్లికేషన్ వినియోగం మరియు ప్రజల భద్రత యొక్క చర్యలు వంటి అంశాలపై వారికి సీఐ సూచనలు సలహాలు ఇచ్చారు.