కొండపి: మాజీ మంత్రి జోగి రమేష్ ని పరామర్శించిన కొండపి వైసిపి ఇన్ ఛార్జ్ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
ప్రకాశం జిల్లా కొండపి వైసిపి ఇన్చార్జ్ మాజీ మంత్రి ఆది మూలపు సురేష్ గురువారం మాజీ మంత్రి జోగి రమేష్ ని మరియు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై కూటమి నాయకులు పెట్రోల్ తో దాడి చేసి భయభ్రాంతులకు గురిచేయడంపై ఆదిమూలపు సురేష్ విచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు . వచ్చేది మళ్లీ జగనన్న ప్రభుత్వమేనని ఈసారి తప్పు చేసిన కూటమి నాయకులను ఎవరిని విడిచి పెట్టేది లేదని మాజీ మంత్రి ఆది మూలపు సురేష్ అన్నారు.