కొండపి: కొండపి నియోజకవర్గం లో రోడ్ల మరమ్మతులు నూతన రోడ్ల నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు కేటాయింపు: మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని పలు రోడ్లకు రూ.22.61 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి క్యాంప్ కార్యాలయం ప్రతినిధి తెలిపారు. గతంలో ఈ రోడ్లు ప్రయాణానికి అనువుగా లేవు. ఇది గమనించిన మంత్రి స్వామి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి రోడ్లకు మహర్దశ పట్టించారని ఆయా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ద్విచక్ర వాహనాల సైతం ప్రయాణించాలంటే సాధ్యపడేది కాదని ఈ రోడ్లు పూర్తయితే తమ ఇబ్బందులు తొలగుతాయన్నారు.