అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శారద నగర్ వద్ద శనివారం 10 గంటల 40 నిమిషాల సమయంలో శివకోటి శ్రీ పీఠం ఆలయ నిర్వాహకుడు అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడితే ఫిబ్రవరి 21వ సాయంత్రం ఐదు గంటలకు అనంతపురం నగరం మీదుగా శివకోటి శ్రీ పీఠానికి కోలాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య పాదాలు రాబోతున్నాయని కావున జిల్లాలో భక్తులంతా కూడా పాల్గొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పాదాలను దర్శించుకోవాలని శివకోటి శ్రీ పీఠం ఆలయ నిర్వాకుడు అరవింద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అప్పుస్వామి ఇతర అర్చకులు పాల్గొన్నారు.