బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు జిజిహెచ్ లో శిక్ష పొందుతున్న బాధితులను పరామర్శించి భరోసా కల్పించిన జెసి కల్పనాకుమారి
Ongole Urban, Prakasam | Mar 26, 2026
మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిజిహెచ్ వైద్యాదికారులకు సూచించారు. గురువారం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఒంగోలు లోని జిజిహెచ్ ను సందర్శించి మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.