గుంతకల్లు: గుత్తి మండలం తురకపల్లి గ్రామంలో పురుగులమందు సేవించి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి గ్రామంలో రంగస్వామి అనే వ్యక్తి మంగళవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం తురకపల్లి గ్రామానికి చెందిన రంగస్వామి చిన్నపాటి విషయంపై ఇంట్లో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.