సర్వేపల్లి: భువనేశ్వరమ్మపై అంత ఈర్ష్య ఎందుకు ప్రసన్నా : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్
భువనేశ్వరమ్మపై అంత ఈర్ష్య ఎందుకు ప్రసన్నా అంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. కాళ్లు పట్టుకునే చరిత్ర నీదైతే, ప్రజలకు సేవ చేసే గొప్ప మనస్సు ఆమెది అంటూ సోమిరెడ్డి అన్నారు. మరోసారి ఆ తల్లి పేరు ఎత్తితే ఊరుకునే ప్రసక్తే లేదనీ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ బకాయిల గురించి వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు అని బుధవారం విమర్శించారు.