జడ్చర్ల: రాజాపూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల తిప్పలు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. పంటలకు సరిపడా యూరియా అందకపోతే దిగుబడి తగ్గిపోతుందని, పంట చేతికి వచ్చే సమయంలో యూరియా కోసం ఎంతకాలం ఎదురుచూడాలో తెలియక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.