ఆత్మకూరు పట్టణంలో ని ABM పాలెం లో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని ఏబీఎం పాలెంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వికలాంగులు, వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా, వెంటనే పైప్‌లైన్ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. తరువాత పట్టణంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డంపింగ్ యార్డ్ స్థలం, దానికి వెళ్లే రహదారి పరిస్థితులను పరిశీలించి సమస్య పరిష్కారించాలన్నారు.