మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి: ఏఐకేఎంఎస్ డిమాండ్
ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఏఐకేఎంఎస్ నాయకులు మంచిర్యాల అదనపు కలెక్టర్ రాములుకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించి పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు.