గుంటూరు: గుంటూరు నగరంలో కాలువల్లా మారిన రోడ్లు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
Guntur, Guntur | Sep 14, 2025 కాలువలనుకుంటున్నారా పొరపాటే.గుంటూరు నగరంలోని రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ కాలువల్లా మారిపోయాయి. ఆదివారం ఏకధాటిగా 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధాన రహదారులు, అనేక కాలనీలు నీట మునిగాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని వాహనాలు నీటిలో మునిగిపోగా, ఓ కారుపై భారీ చెట్టు పడింది. బయటికి వెళ్లే అవకాశం కూడా లేకుండా వర్ష బీభత్సంతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.