జమ్మికుంట: పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని దుర్గామాత అమ్మవారిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం మధ్యాహ్నం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా హౌసింగ్ బోర్డ్ కాలనీలో అమ్మవారిని ప్రతిష్టించుకుని పూజలు నిర్వహించి సమాజమంతా చల్లగా ఉండాలని మీ స్ఫూర్తి తప్పకుండా నెరవేరాలని అన్నార ప్రపంచంలో ప్రకృతిని పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అని మన దేశ స్త్రీలను పూజించే గౌరవించే దేశం భారతదేశం మాత్రమే అన్నారు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు ఆలయాలు అన్నిటిని గొప్పగా కాపాడుతున్నారని అన్నారు.